గోపీచంద్ హిట్ కొట్టిన మూవీను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో సెకండ్ గ్రేడ్ హీరోల్లో ఒకరైన గోపీచంద్.తొలివలపు తో హీరో గా ఆయన తన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ మూవీ తర్వాత కాస్త రూటు మార్చి జయం, నిజం, వర్షం ల్లో విలన్ పాత్ర లో భయపెట్టారు. ఇందు లో గోపిచంద్ నటినకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు.ఈ మూడు సినిమా ల్లో కూడా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే అటు ప్రతినాయకుడి గా మెప్పించిన గోపిచంద్.. అదే సమయంలో మళ్లీగా హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్న చిత్రం యజ్ఞం. 2004లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.ఈ చిత్రానికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా.. ఈతరం ఫిలింస్ బ్యానర్ పై పోకూరి బాబురావు నిర్మించారు. ఫ్యాక్షనిజం నేపథ్యం లో వచ్చిన ఈ లో గోపిచంద్ సరసన సమీరా బెనర్జీ కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం హిట్టయ్యాయి. అయితే ఈ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో గోపిచంద్ కాదట.

ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి హీరో గా ముందుగా ప్రభాస్ ను అనుకున్నారట. కానీ డైరెక్టర్ కొత్త కావడం తో ప్రభాస్ ఈ ను రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత ఇదే స్టోరీని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు చెప్పగా.. పలు కారణాలతో అతను రిజెక్ట్ చేశాడట. అలా చివరకు యజ్ఞం మూవీ గోపిచంద్ వద్దకు వెళ్లింది. ఇక వీరిద్దరి కాంబో లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే.. ఇటీవలే రామాబాణం తో ఆడియన్స్ ముందుకు వచ్చారు మ్యాచో స్టార్ గోపిచంద్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల ను అంత గా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో డింపుల్ హయాతి కథానాయికగా నటించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: