రౌతాయణం పై సెటైర్లు

Seetha Sailaja
‘ఆదిపురుష్’ ఫైనల్ రిజల్ట్ బయటకు రావడంతో ఆసినిమాకు వచ్చిన ఫలితం చూసి ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడ ఇది రామాయణం కాదు ‘రౌతాయణం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంటే ఆమూవీ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అర్థం అవుతుంది. ఈమూవీని చూసిన ప్రతి ఒక్కరూ ఈమూవీ దర్శకుడు ఓం రౌత్ ను టార్గెట్ చేస్తూ విపరీతంగా విమర్శిస్తున్నారు.


అంతేకాదు ప్రభాస్ లాంటి టాప్ హీరోకు కనీసం రామాయణం అంటే కూడ తెలియదా అంటూ జోక్స్ చేస్తున్నారు. రామాయణంలో వాల్మీకి లంకను స్వర్ణమయి లంక అని వర్ణిస్తే ఓం రౌత్ ఆ లంకను గబ్బిలాల కొనగా చూపించడం చూసి చాలామంది షాక్ అవుతున్నారు.   రావణడు పుష్పక విమానంలో తిరిగినట్లుగా రామాయణంలో ఉంటే ఓం రౌత్ మాత్రం తన రామాయణం లో రావణుడు వాహనంగా ఒక విచిత్రమైన పక్షని పెట్టాడు.


ఒక్క గుద్దుతో కొండలను పిండి చేయగల బలశాలి రావణుడు వీణ వాయిస్తే ఆ వీణ తీగలు తెగి రక్తం కారడం ఏమిటి అని మరికొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు పాములతో మసాజ్ చేయించుకోవడం ఏమిటి అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు విభీషణుడు భార్యకు స్లీవ్లెస్ జాకెట్లు ఏమిటి అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


అంతేకాదు లక్ష్మణుడు మూర్ఛపోతే విభీషణుడు భార్య సంజీవిని గురించి చెప్పడం ఏమిటి అంటూ ఆపని చేసింది వానర వైద్యుడు కదా అంటూ మరికొందరు షాక్ అవుతున్నారు. ఈసినిమాను రామాయణం గురించి రేఖా మాత్రంగా తెలిసిన వారు కూడ చూసి తట్టుకోలేక హే రామ్ అంటూ ధియేటర్ నుండి భారంగా బయటకు వస్తున్నారు. అయోధ్య రామమందిరం వ్యవహారంతో శ్రీ రాముడి వేవ్ భారతదేశంలో బాగా పెరిగింది. ఇలాంటి వేవ్ ను క్యాష్ చేసుకోవాలని ఓం రౌత్ ప్రభాస్ తో చేసిన భారీ ప్రయోగం వికటించడంతో ఈసినిమాకు భారీ ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చినప్పటికీ ఈసినిమా ప్రభాస్ కెరియర్ లో మారిచిపోలేని ఫ్లాప్ ల లిస్టులో చేరే స్థానం ఉంది అన్న సంకేతాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: