ఆదిపురుష్ మూవీ పై నేపాలీ ప్రజల ఆగ్రహం !
ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడంతో ఈమూవీ పై నేపాల్ దేశప్రజలు ఆగ్రహంతో ఉండటం షాకింగ్ గా మారింది. రామాయణంలో పేర్కొన్న ప్రకారం సీతాదేవి ఇప్పటి నేపాల్ దేశంలో ఉన్న జనక్పూర్లో జన్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే ‘ఆదిపురుష్’ మూవీలో మాత్రం సీత భారత్ లో జన్మించినట్లు డైలాగ్ ఉంది. అయితే ఈ డైలాగ్ నేపాల్ ప్రజల దృష్టి వరకు వెళ్లడంతో వారు ఆగ్రహంతో ఊ న్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏకంగా నేపాల్ దేశంలోని ఖాట్మండు మేయర్ హిందీ ‘ఆదిపురుష్’ మూవీని చూసి ఈమూవీలో సీత జననం తప్పుగా చూపించారు కాబట్టి ఈమూవీని నేపాల్ దేశంలో బ్యాన్ చేయాలి అనే పిలుపు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణ భారతీయ చిత్రం ఆదిపురుష్లో 'జానకీ ఈజ్ ఏ డాటర్ ఆఫ్ ఇండియా' అనే డైలాగ్ పెట్టారు. దీన్ని నేపాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా మార్చాలి. లేకుంటే ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీలో ఏ హిందీ సినిమాను నడపడానికి అనుమతించం. దీన్ని సరిచేసేందుకు మూడు రోజుల గడువు ఇస్తున్నాము' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈమూవీ దర్శకుడు ఓం రౌత్ గతంలో హనుమంతుడు గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హనుమత్ జయంతి రోజున మైక్ లు పెట్టుకుని అంతగట్టిగా భజన చేస్తే కాని హనుమంతుడుకి వినిపించద అంటూ అతడు గతంలో చేసిన కామెంట్స్ ను ఇప్పుడు బయటకు లాగుతూ ఓం రౌత్ కు హనుమంతుడు పై భక్తి లేకుండా ‘ఆదిపురుష్’ మూవీ తీశాడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు..