ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న
ఎన్టీఆర్ కొంత కాలం క్రితం
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో
రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ద్వారా
ఎన్టీఆర్ కు గ్లోబల్ గా క్రేజ్ లభించింది.
దానితో
ఎన్టీఆర్ కూడా భారీ క్రేజ్ ఉన్న దర్శకుల సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం
ఎన్టీఆర్ ...
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ తర్వాత
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో
ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నాడు. ఈ
మూవీ తర్వాత
బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటువంటి
వార్ మూవీ కి సీక్వెల్ గా రూపొందబోయే
వార్ 2
మూవీ లో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ లో
హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటి మనీ అయినటువంటి కియార అద్వానీ
హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.