వెంకటేష్, మహేష్ కలిసి.. మరో మల్టీప్లెక్స్?
ఈ క్రమంలోనే ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇక మొన్నటికి మొన్న అటు అల్లు వారి వారసుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఏషియన్ సినిమాస్ తో చెయ్యి కలిపి ఒక మల్టీప్లెక్స్ ని ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇద్దరు హీరోలు కలిసి ఇలా మల్టీప్లెక్స్ బిజినెస్ ప్రారంభించినందుకు సిద్ధమవుతున్నారు అనేది తెలుస్తుంది. ఈ మల్టీప్లెక్స్ చైన్ బిజినెస్ లోకి మరో ఇద్దరు స్టార్ హీరోలు భాగస్వామ్యం అవుతున్నారట. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్, రానా, ఘట్టమానేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేయబోతున్నారట.
ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఫేమస్ థియేటర్ గా కొనసాగుతున్న దేవి 70 ఎంఏం థియేటర్ని మల్టీప్లెక్స్ గా మార్చబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనిని కొనుగోలు చేసినట్లు ఏషియన్ సునీల్ తెలిపారు. త్వరలో దానిని నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు.. అధునాతన సాంకేతిక టెక్నాలజీతో దీని అభివృద్ధి చేయబోతున్నట్లు గతంలో ఇంటర్వ్యూలో తెలిపారు సునీల్. ఈయనతో హీరోలు చెయ్యి కలప పోతున్నారట. మొత్తానికి మహేష్ బాబు, రానా, వెంకటేష్ భాగస్వామ్యంలో మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉండడం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ మల్టీప్లెక్స్ కి ఏఎంబి విక్టరీ అనే పేరును కూడా పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సిందే.