గత కొంతకాలంగా
టాలీవుడ్ ప్రముఖ నటుడు
నరేష్ మరియు నటి పవిత్రలోకి సహజీవనం చేస్తున్నారన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.ఇక వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను స్వయంగా వారి సోషల్
మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
నరేష్ పవిత్రకి
పెళ్లి జరిగింది అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. ఇక
నరేష్ కి ఇది 4వ
పెళ్లి పవిత్రకు రెండో పెళ్లి. అయితే గత కొద్ది రోజుల నుండి వీరిద్దరూ
పెళ్లి చేసుకున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ వివాహం చేసుకున్నారని చాలామంది నమ్ముతుంటే మరికొందరు
ఏదో
సినిమా కోసం వీరిద్దరూ ఆడిన డ్రామా అని కొట్టి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే పవిత్ర
లోకేష్ పై తన మొదటి
భర్త చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే మొదట పవిత్ర
కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్ర
ప్రసాద్ ను
పెళ్లి చేసుకుంది. అనంతరం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు సైతం పుట్టారు. దాని తర్వాత తన భర్తతో విభేదాలు రావడంతో తనతో సపరేట్ అయింది పవిత్ర. అనంతరం నటుడు
నరేష్ చట్టపట్టలేసుకొని తిరగడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వారిద్దరికీ సంబంధించిన
పెళ్లి వీడియో వైరల్ అవుతుంది నేపథ్యంలో సుచేంద్ర
ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరికి సంబంధించి కామెంట్స్ చేయడం జరిగింది.
ఈ క్రమంలోనే ఆయన కొన్ని షాకింగ్ నిజంగా బయటపెట్టాడు. పవిత్ర
లోకేష్ అవకాశవాది అని ..విజయనిర్మల గారు కష్టపడి సంపాదించిన 1500 కోట్ల ఆస్తిని నొక్కేసిందని తెలియజేశాడు.
నరేష్ పవిత్ర ఇద్దరూ కలిసి
జల్సా చేస్తూ విజయనిర్మలమ్మ గారి కష్టార్జితాన్ని పాడు చేస్తున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన. లగ్జరీగా జీవించడం అంటే ఆమెకి చాలా ఇష్టమని.. తనకి డబ్బులు మాత్రమే ముఖ్యమని.. తెలియజేశాడు ఆయన. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో
నరేష్ తో తిరుగుతుందని వెల్లడించాడు ఆయన .ఇక ఆయన దగ్గర కూడా డబ్బులు అయిపోయిన తర్వాత మరొకరి దగ్గరికి వెళ్తుందని ఆరోపణలు చేయడం జరిగింది. వారి ఇద్దరిదీ
ప్రేమ వ్యామోహం తెలియదు కానీ డబ్బుపై ఆశతో నా పిల్లలను మోసం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు ఆయన ..!!