ఎన్టీఆర్ అలాంటి పాత్రలు చేయడం అభిమానులకి ఇష్టం లేదు....!!
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఎన్టీఆర్ హీరోగా కాకుండా విలన్ గా కనిపించబోతున్నాడు. హృతిక్ రోషన్ వంటి సీనియర్ స్టార్ హీరో కు పోటీగా విలన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా తో కచ్చితంగా ఎన్టీఆర్ సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడు అంటూ ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున సినిమా యొక్క అంచనాలు ఉన్నాయి. కనుక ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ను విలన్ గా చూడాలని అనుకోవడం లేదు. బాలీవుడ్ లో హీరోగా సినిమా చేస్తే బాగుండేది. చాలా మంది హీరోలు చాలా సీనియర్ లు అయిన తర్వాత మాత్రమే విలన్ పాత్ర ల్లో కనిపిస్తూ ఉన్నారు. అలాంటిది ఎన్టీఆర్ మాత్రం అప్పుడే విలన్ గా నటించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ నందమూరి అభిమానులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గురించి రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ను వార్ 2 లో ఎలా చూపిస్తారో చూడాలి.