సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో....నిజమేనా...?
విజయ్ శనివారం చెన్నైలో పెద్ద ఈవెంట్ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ లో టాపర్స్ ని అభినందించారు. పతి ఒక్క టాపర్‌కి రూ. 5వేల చెప్పున ఆయన ఏకంగా 70లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలంతా.. డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయాలని పేరెంట్స్ కి చెప్పాలని, అంబేద్కర్, పేరియార్ వంటి గొప్ప వారి గురించి తెలుసుకోవాలని వెల్లడించారు. డబ్బు తీసుకుని ఓటు వేసే పద్ధతిని మార్చాలని పిలుపునిచ్చారు. డబ్బు తీసుకుని ఓటు వేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.
అయితే విజయ్ ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయాల్లోకి వెళ్లడమనే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ముందస్తు ప్లాన్‌తోనే విజయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టెన్త్, ఇంటర్ పూర్తయిన వాళ్లు వచ్చే ఎన్నికలకు ఓటు హక్కుకి అర్హులవుతారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా వారందరిని తనకి అనుకూలంగా మార్చుకునేందుకు వీలవుతుందని, ఆ సమయంలో ఇప్పటి విద్యార్థులంతా తనకు ప్రయారిటీ ఇస్తారనే ఉద్దేశ్యంతోనే విజయ్ ఈ కార్యక్రమం చేపట్టినట్టు టాక్. ఇక విజయ్ లానే మరో స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడు..? అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. నిన్న పబ్లిక్ గా విద్యార్థులను విజయ్ ప్రశంసిస్తే.. సూర్య ప్రైవేట్ గా వాళ్ళని కలిసి ప్రశంసించాడు. తాజాగా అగారం ఫౌండేషన్ లో సూర్య విద్యార్థులను కలిసి మాట్లాడాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.