చిన్న హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన కాజల్?

Purushottham Vinay
హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ వరుస ప్లాపులతో సరిగ్గా నిలదొక్కుకోలేక చిన్న హీరోయిన్ గా ఇబ్బంది పడుతున్న టైంలో మగధీర లాంటి బ్లాక్ బస్టర్ కాజల్ జీవితాన్నే మార్చివేసింది. ఆ సినిమా తరువాత కాజల్ కెరీర్ పరంగా వెనక్కి చూసుకోలేదు. వరుస హిట్లతో సౌత్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బన్నీ వంటి స్టార్ హీరోలతో నటించి క్రేజ్ సంపాదించుకుంది.తమిళ్ లో కూడా విజయ్, సూర్య, అజిత్, విశాల్, జీవా లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసింది కానీ అక్కడ తన ముద్ర వేయలేకపోయింది.ఆ తరువాత కొత్త హీరోయిన్స్ రావడం కాజల్ కి ఫ్లోప్స్ రావడం అవకాశాలు తగ్గడం వల్ల ఆమె పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడం జరిగింది.



ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.పెళ్లి తర్వాత కాజల్ నటిస్తుందా లేదా అనే రూమర్స్ కి చెక్ పెడుతూ కొత్త సినిమాల్లో వరసగా నటిస్తూ వెళ్తోంది.నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందాలు.. పోస్టర్ ఇంకా టీజర్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఓ సినిమా టైటిల్ గ్లింప్స్ లో అయితే కాజల్ ని నెక్స్ట్ లెవల్ లో చూపించారు.నిజం చెప్పాలంటే విక్రమ్ మూవీలోని టీనా పాత్రధారి గుర్తొచ్చింది.కాజల్ అగర్వాల్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' సినిమాలో నటిస్తోంది. అలాగే ఈమె లీడ్ రోల్ చేస్తున్న మరో కొత్త చిత్రానికి 'సత్యభామ' టైటిల్ ఖరారు చేసి, గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఈమె ఓ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించింది. టీజర్ లోని ఓ సీన్ లో జుట్టు ముడి వేసుకుంటుంటే.. 'విక్రమ్' సినిమాలోని ఏజెంట్ టీనా రోల్ అందరికి గుర్తొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: