విమర్శలపై ఆదిపురుష్ నిర్మాత షాకింగ్ కామెంట్స్?

Purushottham Vinay
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా నెగటివ్ టాక్ తోనే థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది.అసలు టాక్ తో సంబంధం లేకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.340 కోట్లు కలెక్షన్స్ సాధించి, కొత్త రికార్డులు తిరగరాస్తోంది. అదే టైంలో ఈ సినిమాలో పాత్రలు ఇంకా వాటి గెటప్స్ పై ఇప్పటికే ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.సినిమాలోని కొన్ని డైలాగ్స్ అయితే వివాదస్పదంగా మారాయి. ఈ సినిమా వాల్మీకి రామాయణంకి వ్యతిరేకంగా వుండంటూ ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలని సోషల్ మీడియాలో ఆందోళన చేస్తున్నారు హిందువులు.అందువల్ల కొన్ని మార్పులు చేసి ఈ సినిమాలో డైలాగ్స్ ని మార్చాలని కూడా ఫిక్స్ అయ్యారు మేకర్స్.మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రావణుడి లుక్ పై ఘోరంగా విమర్శలు వస్తున్నాయి. అయితే అసలు రావణుడి పాత్ర ఎందుకు అలా డిజైన్ చేయాల‍్సి వచ్చిందనేది నిర్మాత వివేక్ కూచిభొట్ల ఇప్పుడు కాస్త క్లారిటీ ఇచ్చే ప‍్రయత్నం చేశారు.టీ సిరీస్ సంస‍్థ నిర్మించిన 'ఆదిపురుష్' సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పంపిణీ చేసింది. దాదాపు రూ.185 కోట్లు పెట్టి ఈ సినిమా హక్కుల్ని కొనుగోలు చేసింది. అయితే అదంతా పక్కనబెడితే మూడురోజుల్లో అంటే ఆదివారం దాకా ఈ సినిమాను కోటి మందికి పైగా చూశారు. దీంతో 'రామకోటి ఉత్సవం' పేరిట హైదరాబాద్ లో సోమవారం నాడు ఓ కార్యక్రమం నిర్వహించారు.



ఇందులోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' నేటి చిన్నపిల్లలకు అర్థమయ్యేలా ఓ సినిమా తీయాలి. రామాయణం అంటే పాతకాలంలాగా సంస్కృత పద్యాలు ఇంకా డైలాగ్స్ తో సినిమా తీస్తే.. అప్డేట్ అవ్వండ్రా అని మీరే అంటారు. ఇప్పుడేమో అప్డేట్ అయి సినిమాని తీస్తే.. మళ్లీ రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? ఇంకా వాళ్లేంటి ఇలా ఉన్నారు? వీళ్లేంటి ఇలా ఉన్నారని  అంటున్నారు. ఆయన్ని మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ ఊహకు మీరు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నారు. మా ఊహకు మేము రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నాం.''కానీ ఈ సినిమాలో మాత్రం ఎక్కడా చరిత్రని తప్పుదోవ పట్టించలేదు. రాముడు ధీరోదాత‍్తుడు ఇంకా సకలాగుణాభిరాముడు అనే చూపించారు. సమాజానికి మంచి చెప్పడానికి నేటి  పిల్లలకు అర్థమయ్యేటట్టు.. అంటే ఈ రోజు పిల్లలని తీసుకుంటే తోర్, హల్క్ ఇంకా డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్లకు జాంబవంతుడు, సుగ్రీవుడు ఇంకా అంగదుడు అంటే ఎవరో తెలుసా? తెలియదు.ఇంకా బ్యాట్ మ్యాన్ ఫొటో చూపిస్తే వెంటనే గుర్తుపడతారు. అంగదుడిని చూస్తే గుర్తుపట్టలేరు. కనీసం ఈ రకంగా అయినా మన పిల్లలకు రామాయణంలోని పాత్రలు పిల్లలకు తెలిసే అవకాశముంటుంది' అని నిర్మాత వివేక్ కూచిబొట్ల చెప్పుకొచ్చారు.అయితే ఇతని కామెంట్స్ వల్ల  వివాదం ఇంకా ఎక్కువ అయ్యింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: