రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన.. సూపర్ హిట్ సాంగ్స్ ఏవో తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే ఎంతో మంది సినీ ప్రముఖులు అకాల మరణం చెందుతూ ఉండడంతో ఇక సినీ ప్రేక్షకులు అందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగిపోతున్నారు. ఇక ఇటీవల టాలీవుడ్ లో ప్రముఖ డాన్స్ మాస్టర్ గా పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు ఇటీవల సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు అని చెప్పాలి



 ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రాకేష్ మాస్టర్ అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఆయన వార్తల్లో నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి 1968లో తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్ రామారావు ఆయనకు నలుగురు అక్కలు అన్న తమ్ముడు కూడా ఉన్నారు చిన్నప్పటి నుంచి డాన్స్ పై ఎక్కువ మక్కువ చూపించిన రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ముక్క రాజు దగ్గర కొంతకాలం అసిస్టెంట్ గా పనిచేసి తర్వాత డాన్స్ మాస్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చారు



 అయితే నేటి జనరేషన్ పిల్లలకు రాకేష్ మాస్టర్ కేవలం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు యూట్యూబ్ వీడియోలలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అని మాత్రమే అందరికీ తెలుసు కానీ ఏకంగా దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన పని చేశారని ఇక స్టార్ హీరోల సినిమాల్లోని పాటలకు సైతం ఆయన డాన్స్ సమకూర్చారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఇక రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ హిట్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మనసిచ్చాను – వెండితెరకు మా వందనాలు
2. యువరాజు – చందమామ కన్న చర్లని వాడే
3. బడ్బెట్ పద్మనాభం – సొమ్ము ఆదా చేయారా
4. సీతారామరాజు – ఎక్స్టసీ ప్రైవసీ
5. గర్ల్ ఫ్రెండ్ – నువ్వు యాడికొస్తే ఆడికొస్త సువర్ణా
6.చిరు నవ్వుతో – నిన్నలా మొన్నలా లేదురా
7. లాహిరి లాహిరి లాహిరిలో – నేస్తామా ఓ ప్రియ నేస్తమా..
8. దేవదాసు – నువ్వంటేనే ఇష్టం
9. దేవదాసు – బంగారం.. బంగారం
10. దేవదాసు – నిజంగా చెప్పాలంటే క్షమించు, ఏయ్‌ బాబూ ఏంటి సంగతి

ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ గా పని చేశారు రాకేష్ మాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: