దర్శక ధీరుడు రాజమౌళి.. మధ్యలోనే ఆపేసిన 2 సినిమాల గురించి తెలుసా?

praveen
స్టార్ రైటర్ అయినా విజయేంద్ర ప్రసాద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రాజమౌళి. సీరియల్ డైరెక్టర్గా కెరియర్ను ప్రారంభించిన రాజమౌళి.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇక వెండితెరపై డైరెక్టర్గా ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇదే సినిమాతో అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే నాటి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్నటికి మొన్న రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు రాజమౌళి. ఇక ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ గా కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి.



 రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కినవి  కేవలం 13 సినిమాలు అయినప్పటికీ ఊహించని రీతిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను తారుమారు చేయలేకపోయింది అని చెప్పాలి. అందుకే ఓటమి ఎరుగని దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు రాజమౌళి. ఇక ఇప్పుడు తన తదుపరిచిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఏదైనా సినిమా స్టార్ట్ చేశాడంటే అది ఆగే ఆసక్తి ఉండదు. ఎందుకంటే సినిమా కథ విషయంలో అంత క్లారిటీతో ఉంటాడు రాజమౌళి.


 కాస్త ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ప్రాజెక్టును మాత్రం కంప్లీట్ చేస్తాడు. కానీ రాజమౌళి కెరియర్ లో మొదలై ఆగిపోయిన సినిమాలు రెండు ఉన్నాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత రాజమౌళి మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఒక మైతకలాజికల్ సినిమా చేయాలని అనుకున్నాడు. అంతా ఓకే అయ్యింది అనుకున్నాక ఎందుకొ చివరికి ఈ మూవీ క్యాన్సిల్ అయింది. ఇక రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాష్ తో ఒక భారీ బడ్జెట్ మూవీ ని ప్లాన్ చేశాడట రాజమౌళి. కానీ అంతకుముందే సూర్యప్రకాశ్ నటించిన నీతో మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: