టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాగార్జున "బంగార్రాజు" మూవీ తో ఇటీవల కాలంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన మూవీ కి సీక్వెల్ గా రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నాగార్జున ... ప్రవీణ్ సత్తార్ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన ది ఘోస్ట్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గ నటించింది. దసరా పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.
దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న నాగార్జున ఇప్పటి వరకు తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ప్రకటించలేదు. కొన్ని రోజుల క్రితం వరకు నాగార్జున తన తదుపరి మూవీ ని రైటర్ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కార్తికేయ హీరోగా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా రూపొందిన ఆర్ఎక్స్ 100 మూవీ తో దర్శకుడు ఆ కెరియర్ ను మొదలు పెట్టిన అజయ్ భూపతి దర్శకత్వంలో నాగార్జున తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే ఈ దర్శకుడు నాగార్జున తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.