'ఆదిపురుష్' కోసం సైఫ్ అలీ ఖాన్ అన్ని కోట్లు తీసుకున్నాడా..?

Anilkumar
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఓం రౌత్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆదిపురుష్' రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీ తో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టింది. అటు విమర్శకుల నుంచి కూడా ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ రావడం గమనార్హం. అయితే సినిమా టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ గా అదరగొడుతోంది. మొదటి రోజే ఏకంగా రూ.140 కోట్ల గ్రాస్ అందుకొని ప్రభాస్ కెరియర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీ గా రికార్డు నెలకొల్పింది. 


ఇక మొదటి వీకెండ్ సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు అందుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో లంకేష్ పాత్రలో బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే కదా. అయితే తాజాగా ఈ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్ తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం ఆదిపురుష్ సినిమాలో లంకేష్ పాత్రలో నటించినందుకు గాను సైఫ్ అలీ ఖాన్ సుమారు రూ.12 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటీనటుల్లో ఒకరిగా నిలిచాడు సైఫ్ అలీ ఖాన్. ఇక ఇందులో టాప్ పొజిషన్లో మన డార్లింగ్ ప్రభాస్ ఉన్నాడనే విషయం తెలిసిందే.


ఆదిపురుష్ కోసం ప్రభాస్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవ అలాగే అతడి తండ్రి దశరథ్ పాత్రలో ద్విపాత్రాభినయం చేసినందుకు సుమారు రూ.100 నుంచి రూ.150 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ నటీనటుల్లో ఈ ఇద్దరే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. కాగా సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ తర్వాత టాలీవుడ్ లో మరో బడా పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఆ సినిమానే ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దేవర'. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్లో కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: