ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజ్ బ్యూటీ గా కెరియర్ ను కొనసాగిస్తున్న మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సీతా రామం అనే తెలుగు మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన హను రాగవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో సీత పాత్రలో నటించిన మృణాల్ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే ఈ నటికి అద్భుతమైన గుర్తింపు లభించింది.
ఇది ఇలా ఉండే ప్రస్తుతం మృణల్ ... నాని హీరోగా రూపొందుతున్న ఒక మూవీ లోను ... విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న మరో మూవీ లోను హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస మూవీ లతో కెరీర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా తాజాగా మృణాల్ అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ బుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని వైట్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.