స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్లో డింపుల్ హయాతి..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మొదట గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి అవకాశాలను అందుకుంది. కానీ హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గ్లామర్ షో తో ఎప్పుడు రెచ్చిపోయి కనిపిస్తున్న డింపుల్ హయాతి ఇప్పుడు తాజాగా మళ్లీ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ సినిమాలో ఈమె స్పెషల్ సాంగ్లో నటించబోతున్నట్లు సమాచారం.


తెలుగులో డింపుల్ హయాతి బాగానే పాపులర్ సంపాదించిన ఎందుకో కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ అవకాశాలు అందుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో తరచూ ఈమె పేరు బాగా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా పోలీస్ కేసు వివాదంలో ఈమె చిక్కుకోవడంతో మరింత వైరల్ గా మారుతోంది. ఈ కేసు వల్లే ఈమె మళ్లీ స్పెషల్ సాంగ్లో చేసే అవకాశం లభించిందని సమాచారం కోలీవుడ్లో స్టార్ హీరో గా పేరుపొందిన నటుడు కమలహాసన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్-2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇందులో రకుల్ ప్రీతిసింగ్, కాజల్ అగర్వాల్ తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు.


ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ డింపుల్ హయాతి నటించబోతున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సాంగులో కమలహాసన్ కూడా ఫుల్ మాస్ స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ పాటతో నైనా డింపుల్ హయాతి అదృష్టం మారుతుందేమో చూడాలి మరి అంటు అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఈ ఏడాది గోపీచంద్ నటించిన రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేక పోయింది కానీ ఈ సినిమాలో డింపుల్ హయాతి అందాలు అందరిని ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: