జైలర్: రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ప్రమోషన్స్ మాత్రం లేవు..!?

Anilkumar
సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన డైలాగ్ డెలివరీస్ వాట్స్ ట్రైల్ ప్లీజ్ మేనరిజం ఇలా ఆయనకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఆయన చేస్తున్న లేటెస్ట్ సినిమా జైలర్. దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న జైలర్ సినిమా కోసం తలైవా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 


రజినీకాంత్ ముత్తు వేల్ పాండియన్ గా కనిపించనున్న జైలర్ సినిమాపై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. రజిని మోహన్ లాల్ లతోపాటు కన్నడ సూపర్ స్టార్ శివన్న కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఆగస్టు 10 న విడుదల చేయబోతున్నారు చిత్ర బంధం. ఇక ఈ సినిమా రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది.


కానీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ని కూడా ఇవ్వడం లేదు. ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే చిత్ర బృందం ఈ విషయంలో చాలా వీక్ గా కనిపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రజనీకాంత్ సినిమా ఇంత. సైలెంట్ గా ఉండడం గత మూడు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. ఒక సాంగ్ అనౌన్స్మెంట్ లేదు కొత్త పోస్టర్స్ ని సైతం విడుదల చేయడం లేదు. ఈ క్రమంలోనే నిజంగానే ఈ సినిమాని ఆగస్టు 10 న రిలీజ్ చేస్తారా లేదా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాపై మంచి హైప్ పెరగాలి అంటే ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా గట్టిగా చేయాలని అంటున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: