కంగారు పడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్....!!
అలాగే పూజా హెగ్డేని కూడా తీసేసినట్టు ప్రచారం సాగుతుంది ఈ వార్తలపై థమన్ కాస్త గట్టిగానే బదులిచ్చారు ఎవరికైనా కాలితే తమ ఇంటి దగ్గర మజ్జిగ అందిస్తున్నాము తాగొచ్చు అంటూ సెటైర్ వేశారు ఇక చిత్ర యూనిట్ సభ్యులనుంచి కూడా క్లారిటీ వచ్చింది.ఈ చిత్రానికి థమన్ వర్క్ చేస్తున్నాడని ఆయన ఎప్పటిలానే మ్యూజిక్ రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇక హీరోయిన్ విషయం లోమాత్రం క్లారిటీ రాలేదు . పూజా కానీ చిత్ర బృందం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజా రూమర్ ఏంటంటే.
పూజా హెగ్డే స్థానంలో సంయుక్త మీనన్ను తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నారనేది సమాచారం మరోవైపు ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ను టార్గెట్ చేస్తూ వరుస పోస్ట్లు చేస్తున్న నిర్మాత బండ్ల గణేశ్ మరో పోస్ట్ చేశారు. సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా అంటూ ఇండైరెక్ట్గా త్రివిక్రంపై సెటైర్ వేశాడు...ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి మరో పోస్ట్ కూడా చేశారు. మార్చారు అని చెప్పింది మీరేగా దయచేసి తెలిసి తెలియని వార్తలు రాయకండి అని చెప్పుకొచ్చాడు .మొత్తం మీద గుంటూరు కారం చుట్టూ రూమర్స్ నడుస్తుండటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్పు విషయంలో క్లారిటీ ఇచ్చినట్లే హీరోయిన్ మేటర్లో కూడా స్పష్టత ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై కూడా క్లారిటీ వస్తుందేమో చూడాలి.