మహేష్ సినిమా నుంచి తప్పుకోవడంపై.. పూజా హెగ్డే క్లారిటీ?
అంతేకాదు శ్రీ లీలా, మహేష్ బాబు కలిసి ఉన్న ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది అని చెప్పాలి. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే పూజా హెగ్డే ఎందుకు మహేష్ బాబు సినిమా నుంచి తప్పుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఇటీవలే పూజా హెగ్డే టీం క్లారిటీ ఇచ్చింది. గుంటూరు కారం సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కాల్ షీట్స్ సర్దుపాట్లు చేయలేకపోయినా హీరోయిన్ పూజా హెగ్డే.. గుంటూరు కారం చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అంటూ పూజా హెగ్డే వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
ఇకపోతే ఇక పూజ హెగ్డే తప్పుకోవడంతో సెకండ్ హీరోయిన్ శ్రీ లీల కాస్త లక్కీ ఛాన్స్ కొట్టేసి మొదటి హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు శ్రీ లీల స్థానంలో సెకండ్ హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే సెకండ్ హీరోయిన్ కోసం అటు సంయుక్త మీనన్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నారట. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇక త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి జనవరి 13వ తేదీన సినిమాలు విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుందట. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేయగా అభిమానుల నుంచి ఊహించని ఆదరణ దక్కింది అని చెప్పాలి.