ఏంటి.. చరణ్ కంటే.. ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువట తెలుసా?

praveen
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇప్పుడు ముగ్గురు అయ్యారు. గత ఏడాది ప్రెగ్నెంట్ అని ప్రకటించి అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. ఇటీవల జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోనే అపోలో ఆసుపత్రిలో మెగా లిటిల్ ప్రిన్సెస్ కు జన్మనిచ్చింది. అయితే ఇక ఎన్నో ఏళ్ళ తర్వాత ఇక మెగా ఫ్యామిలీలోకి వారసురాలు రావడంతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసనలకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి.



 కాగా 2012లో పెద్దలు అంగీకారంతో రామ్ చరణ్, ఉపాసన పెళ్లి చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత కొన్నెళ్ల పాటు పిల్లలు వద్దు అనుకున్న ఈ జంట దాదాపు 11 ఏళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పారు. అయితే కెరియర్ పరంగా ఇద్దరు బిజీబిజీగా ఉన్నారు అని చెప్పాలి. తండ్రి వారసత్వంగా వచ్చిన అన్ని వ్యాపారాలను ఉపాసన చూసుకుంటూ ఉపాసన.. బిజీబిజీగా ఉంటే ఒకవైపు సినిమాలు మరోవైపు నిర్మాణరంగంలో అటు రామ్ చరణ్ కూడా బిజీబిజీగానే కెరియర్లో ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి.


 అయితే చరణ్ సతీమణి ఉపాసన బ్యాక్ గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపార దిగ్గజం అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు 9 కంపెనీలలో భాగస్వామ్యంగా ఉన్న అనిల్ కామినేని అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ శోభన కామినేని కుమార్తె ఫారెన్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టా పొందింది. ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉంది. కాగా ఉపాసన ఆస్తుల విలువ 1370 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. అలాగే రామ్ చరణ్ ఆస్తుల విలువ 1130 కోట్ల వరకు ఉందట. అంటే ఇక చరణ్ ఆస్తుల కంటే ఉపాసన ఆస్తుల విలువ ఎక్కువగా ఉందట. వేల కోట్లకు వారసులు అయిన ఇద్దరికి మాత్రం మంచి మనసు ఉంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: