"జైలర్" మూవీ ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న అభిషేకం మనకు తెలిసిందే. ఈ మూవీ లో తమన్నా , రమ్యకృష్ణ కీలక పాత్రలలో కనిపించబోతుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి బీస్ట్ మూవీ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
 


అందులో భాగంగా ఈ సినిమా నుండి మొదటి పాటను మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క ఎంటైర్ ఓవర్ సీస్ హక్కులను అయంగరన్ ఇంటర్నేషనల్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క మొత్తం ఓవర్ సిస్ హక్కులను ఈ సంస్థ దాదాపు 32 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించడంతో ఈ మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ మ్యూజిక్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: