దసరా
మూవీ తో అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న
నాని ప్రస్తుతం తన కెరియర్ లో 30 వ
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో మృనాల్ ఠాగూర్ ...
నాని సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ
మూవీ కి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం
డిసెంబర్ 21 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యూనిట్ అనుకున్న దాని కంటే స్పీడ్ గా ఈ
మూవీ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానితో ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన 70% షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది.
ఆగస్టు నెల నాటికి ఈ
మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ
మూవీ ప్రమోషన్ లకు చాలా సమయం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఈ
మూవీ యూనిట్ కు చాలా బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ కోనూరులో ఉండబోతుంది. ఈ షెడ్యూల్ లో ఈ చిత్ర బృందం ఈ సినిమాలోని చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.