పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం తొలిప్రేమ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కీర్తి రెడ్డి ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటించగా ... అద్భుతమైన టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అద్భుతమైన ప్రేమ కథతో రూపొందిన ఈ సినిమా ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఈ మూవీ తో పవన్ కు యూత్ లో ఎక్కడలేని క్రేజ్ లభించింది.
ఇది ఇలా ఉంటే అలా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని థియేటర్ లలో జూన్ 30 వ తేదీన 4 కే అల్ట్రా HD వర్షన్ తో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన మరో అప్డేట్ ను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను జూన్ 24 వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి ... జల్సా మూవీ లు ఇప్పటికే రీ రిలీజ్ అయ్యాయి. అలాగే ఈ మూవీ లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ లకు భారీ కలెక్షన్ లు కూడా రీ రిలీజ్ లో భాగంగా లభించాయి. మరి తొలిప్రేమ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.