తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే చైతన్య ఆఖరుగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు , తమిళ భాషల్లో విడుదల అయింది.
కాకపోతే ఈ మూవీ కి ఇటు టాలీవుడ్ ... అటు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ల నుండి మంచి రెస్పాన్స్ లభించలేదు. ఇలా కస్టడీ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన చైతన్య ప్రస్తుతం తన తదుపరి మూవీ పై పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ యువ హీరో తాజాగా కార్తికేయ 2 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో తన తదుపరి మూవీ ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే చైతన్య ... చందు మండేటి కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలి అనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ఆల్మోస్ట్ ఈ ముద్దు గుమ్మను ఈ మూవీ మేకర్స్ కన్ఫామ్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కనుక నిజం అయితే చైతన్య ... కీర్తి సురేష్ కాంబోలో వచ్చే మొదటి సినిమా ఇదే అవుతుందే. ఇది ఇలా ఉంటే ఇది వరకే చైతన్య ... చందు మండేటి కాంబినేషన్ లో సవ్యసాచి ... ప్రేమమ్ మూవీ లు రూపొందాయి.