గత ఏడాది కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ విజయని అందుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. దాని తర్వాత డిసెంబర్ లో వచ్చిన 18 పేజెస్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. దాని తర్వాత ఆయన నటించిన సినిమా స్పై. కెరియర్ లోనే మొదటిసారి నిఖిల్ గూఢచారిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని సైతం విడుదల చేశారు. త్వరలోనే ఫ్రీ రిలీజ్ కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నరు చిత్రబంధం. జూన్ 27న ఈ 3 రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూన్ 27న జరగనున్న స్పై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు అని తెలుస్తోంది. హైదరాబాద్ శిల్పకళా వేదిక లో ఈ ఈవెంట్ జరగబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఆజాద్ హిందూ ఫౌజ్ సృష్టికర్త సుభాష్ చంద్రబోస్ విమానం ప్రమాద మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా రానుంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఈ సినిమా రాపోతోంది. ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
కాగా ఈ సినిమా జూన్ 29న గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ట్రైలర్ లో చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెపుతూ.. చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు దాస్తుంది ..దానికి సమాధానం మనమే వెతకాలిమ్ అంటూ సాగె సంభాషణతో మొదలయ్యింది ఈ ట్రైలర్. నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది.ఈ సినిమాని మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని విదేశాల్లో సైతం షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..!!