ప్రస్తుతం పవన్
కళ్యాణ్ ...
అల్లు అర్జున్ ...
రవితేజ శర్వానంద్ హీరోలుగా రూపొందుతున్న
మూవీ లు షూటింగ్ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం వీరు హీరోలుగా నటిస్తున్న సినిమాల షూటింగ్ లు ఏ దశలో ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ
మూవీ బృందం ప్రస్తుతం పవన్
కళ్యాణ్ లేకుండా ఈ సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ
మూవీ లో
ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ ప్రస్తుతం
రష్మిక మందన
హీరోయిన్ గా
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ
మూవీ బృందం ప్రస్తుతం కొన్ని రెగ్యులర్ సన్నివేశాలను రూపొందిస్తుంది. దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ
మూవీ లో ... ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
మాస్ మహారాజా
రవితేజ ప్రస్తుతం
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో అనుపమ పరమేశ్వరన్ ...
రవితేజ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ
మూవీ బృందం కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో
రవితేజ పై రాత్రి పూట సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ ప్రస్తుతం తన కెరియర్ లో 35 వ
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్
హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ
మూవీ బృందం ప్రస్తుతం శర్వానంద్ ... కృతి శెట్టి లపై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.