ఈగల్ సినిమాలో అలాంటి సన్నివేశాలతో షాక్ ఇవ్వనున్న రవితేజ..!?

Anilkumar
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాల విషయంలో ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ వాటి షూటింగ్స్ పనిలో బిజీగా మారాడు. రవితేజ ప్రస్తుతం రవితేజ ప్రకటించిన సినిమాల షూటింగ్స్ అన్ని పూర్తి కాగా షూటింగ్ దశలో ఇప్పుడు ఒకే ఒక సినిమా ఉంది. అందుకే సినిమాలను ఎంచుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు రవితేజ. రీసెంట్గా ఒక కొత్త సినిమాని సైతం అనౌన్స్ చేసాడు. భారీ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కబోతున్న సినిమా ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఆడియన్స్ కోసం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ పోకుండా త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని  ప్లాన్ చేస్తున్నారట. ప్రతి 15 నిమిషాలకు కూడా ఒక థ్రిల్లింగ్  అంశంతో ఆడియన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వరున్నారట. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాంతోపాటు ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది.

ప్రస్తుతం మాస్ మహారాజా పాన్ ఇండియా సినిమా అయిన టైగర్ నాగేశ్వర రావు లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇటీవలే దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదలవగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇందులో రేణు దేశాయ్ సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి .కాగా ఈ సినిమాలో రవితేజ దొంగగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: