HBD Vijayashanti: విజయశాంతి అందుకున్న పురస్కారాలు ఏంటో తెలుసా..?

Divya
ప్రముఖ సినీ నటిగా , నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ది లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో.. వివిధ పాత్రలలో సుమారుగా 180 కి పైగా చిత్రాలలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, మలయాళం , హిందీ , కన్నడ భాషా చిత్రాలలో నటించి మంచి పేరు దక్కించుకున్న ఈమె 1991లో వచ్చిన కర్తవ్యం సినిమా ద్వారా తన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.

అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఏకంగా ఏడుసార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను.. అలాగే ఆరుసార్లు ఉత్తమ నటి పురస్కారాలను కూడా అందుకుంది. 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది విజయశాంతి.  అలాగే నాలుగు రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 1985లో ప్రతిఘటన సినిమాలో తన పాత్రకు గాను నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఈమె 1987లో చిరంజీవితో కలిసి నటించిన స్వయం కృషి సినిమా ను మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అలాగే హాలీవుడ్ నటుడు థామస్ జనే తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా కూడా లూస్వేల్లీస్ ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడి ఆమెకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి.

ఇకపోతే కొన్ని వందలాది చిత్రాలలో నటించిన విజయశాంతి హీరోలతో సమానంగా పారితోషకం తీసుకున్న ఏకైక హీరోయిన్గా అప్పట్లోనే రికార్డు సృష్టించింది.  కర్తవ్యం సినిమా కోసం ఏకంగా కోటి రూపాయల పారితోషకం పొంది మంచి గుర్తింపు , రికార్డు క్రియేట్ చేసిన ఈమె 1998లో రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రాజకీయంలోనే కొనసాగుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: