ఆరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "శ్రీదేవి శోభన్ బాబు" మూవీ..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న యువ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. ఈ నటుడు పేపర్ బాయ్ మూవీ తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ యువ నటుడు ఆ తర్వాత ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ.లో కావ్య తప్పర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.


ఏక్ మినీ కథ మూవీ తో ఈ నటుడు కి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటుడు చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. కాకపోతే ఆ మూవీ లు ఏవి ఈ నటుడు కి పెద్దగా విజయాలను తెచ్చిపెట్టలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే సంతోష్ శోభన్ "శ్రీదేవి శోభన్ బాబు" అనే సినిమాలో హీరోగా నటించాడు. ప్రశాంత్ కుమార్ దిమ్మెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌరీ జి. కిషన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా బుల్లి తెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కావడానికి రెడీ అయింది.


సినిమా యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ మా చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానుంది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అల్లరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: