గుంటూరు కారం సినిమాలో ఊహించని స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా వరుస వివాదాలలో చుట్టుకుంది అన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలుసార్లు వాయిదా పడింది అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అనుకున్న సమయం కంటే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది అని తెలుస్తోంది. షూటింగ్ నడుస్తున్న సమయంలోనే మహేష్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. దాంతో ఈ సినిమా ఆలస్యం మరింత ఎక్కువైంది.


అలా కొంతకాలం విరమం తీసుకున్న మహేష్ బాబు దాని తర్వాత నెమ్మదిగా షూటింగ్ జరుపుకున్నారు. ఏదో ఒక అవాంతరం షూటింగ్లో వస్తూనే ఉంది. ఈ క్రమంలోని ఈ సినిమా షూటింగ్ మళ్లీ మళ్లీ వాయిదా పడుతూ ఉండడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే సైతం ఇందులో నుండి తప్పుకుంది  అని తెలుస్తుంది.ఇప్పటికే ఈ విషయంపై పూజా హెగ్డే టీం క్లారిటీ సైతం ఇవ్వడం జరిగింది.ఇక పూజ హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీలా పంట పండింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటివరకు శ్రీ లీలని ఈ సినిమాలో సెకండ్


 హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు పూజ హెగ్డే తప్పుకోవడంతో ఈమెని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు.అయితే ఈ క్రమంలోనే సెకండ్ హీరోయిన్ ఎవరు అని చూస్తే ఊహించని భామను ఎంపిక చేసుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి. కిలాడి హిట్ 2 సినిమాలతో ఆకట్టుకుంది ఈమె. అయితే తాజాగా మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు అన్న వార్తలు వినబడుతున్నాయి. దీంతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సెకండ్ హీరోయిన్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: