పాన్
ఇండియా స్టార్ గా యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ఎనలేని స్టార్ డం ని సొంతం చేసుకున్నాడు.
బాహుబలి సినిమాతో దేశంలో ఏ
హీరో అందుకోలేని రికార్డులు క్రియేట్ చేసాడు. ఇక రేంజ్ అంచనాలతో వచ్చిన ఆదిపురుష్
సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు.కానీ ఈ
సినిమా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ చాలా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రోజురోజుకు తగ్గిపోతూ వస్తున్నాయి.పెద్ద పాన్
ఇండియా హీరో, ఇంటర్నేషనల్ లో పేరు పొందిన పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఇంకా భారీ స్టార్ క్యాస్ట్ ఇన్ని బలాలు వున్నా ఆదిపురుష్ టీం ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. ఇక
ఏపీ తెలంగాణలో మొదటి రోజు 32 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ
మూవీ వసూళ్లు ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. మొత్తంగా ఏడవ రోజు చూసుకుంటే ఈ సినిమాకు కేవలం చాలా దారుణంగా 97 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఎనిమిదవ రోజు అంతకంటే తక్కువగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా దారుణంగా 65 లక్షల షేర్ మాత్రమే దక్కింది.మొత్తానికి దిల్ రాజు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయకుండా సేఫ్ అయ్యాడు.
ఇక మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ
సినిమా దేశవ్యాప్తంగా ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం 8 రోజుల్లో ఆదిపురుష్ సినిమాకు 75.92 కోట్ల షేర్ కలెక్షన్స్ 121 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటకలో అయితే 11.82 కోట్లు రాగా తమిళనాడులో చాలా దారుణంగా 2.34 కోట్ల షేర్ వచ్చింది.ఇక కేరళలో అయితే మరింత దారుణంగా కేవలం 84 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక
హిందీ అలాగే రెస్ట్ ఆఫ్
ఇండియా చూసుకుంటే మొత్తం 65.35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో ఇప్పటి దాకా ఈ
సినిమా 23.60 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో ఆదిపురుష్
సినిమా మొత్తం 179.87 కోట్ల షేర్ కలెక్షన్స్ 363 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ
మూవీ ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసింది. ఇక 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో వచ్చిన ఆదిపురుష్ ఇప్పుడు 200 కోట్లు షేర్ కలెక్ట్ చేయడానికి నానా కష్టాలు పడుతుంది.
డైరెక్టర్ ఇంకా అతని టీం కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా తీసుంటే ఈ
సినిమా అలవోకగా ఈపాటికి 1500 నుంచి 2000 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. పైగా రామాయణం లాంటి ఎపిక్ స్టోరీ కాబట్టి 2000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఇంత మంచి ఛాన్స్ వున్న ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఓం రౌత్.