మ్యాథ్స్ టీచర్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్?

Purushottham Vinay
టాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్‌ స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కబీర్‌ సింగ్‌ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌ అనే అమ్మాయితో కలిసి కబీర్ ఏడడుగులు నడిచాడు.ఫరీదాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరు కుటుంబాలతో పాటు వధూవరుల సన్నిహితులు ఇంకా స్నేహితులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించారు. కబీర్‌- సీమ చాహల్‌ల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక హర్యానా రాష్ట్రానికి చెందిన కబీర్‌ సింగ్‌.. గోపీచంద్‌ ‘జిల్‌’ సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి మూవీలోనే సూపర్ స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఆ తర్వాత కిక్‌ 2, డిక్టేటర్‌, వేదాళం (తమిళ్‌), స్పీడున్నోడు, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, సుప్రీమ్‌, జక్కన్న, సాక్ష్యం, శాకినీ డాకినీ, హంట్‌, కబ్జా వంటి సినిమాల్లో విలన్ గా నటించి బాగా మెప్పించాడు.రీసెంట్ గా సమంత నటించిన శాకుంతలం సినిమాలో కూడా అసుర రాజుగా ఆకట్టుకున్నాడు.ఇక కబీర్‌ భార్య సీమా చాహల్‌ విషయానికొస్తే.. ఆమె మ్యాథ్స్‌ టీచర్‌ అని సమాచారం తెలుస్తోంది. ‘ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు, అభిమానులు నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. నా సతీమణి సీమకు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె జీవితంలో నేను ఒక బెస్ట్‌ హీరోగా ఉండాలనుకుంటున్నాను. నేను ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఇక ఇప్పుడదే నిజమైంది. సీమాను కలిసిన మొదటి క్షణంలోనే ఆమే నా భార్య అనిపించింది. నన్ను, నా ఫ్యామిలీని బాగా అర్థం చేసుకోగలదన్న నమ్మకం నాకు కలిగింది. ఆమెతో కలిసి నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు కబీర్‌ సింగ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: