కొత్త కారు కొన్న మహేష్ బాబు.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే?
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోలలో అటు మహేష్ బాబు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు గ్యారేజీలో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ గ్యారేజీలోకి మరో కోట్ల రూపాయల విలువ చేసే కారు వచ్చి చేరింది అన్నది తెలుస్తుంది. ఇటీవల మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ ఎస్వీ లేటెస్ట్ వర్షన్ కారును కొనుగోలు చేశారట. అయితే ఈ కారు ఖరీదు అక్షరాల 5.4 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అయితే హైదరాబాద్లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు మహేష్ బాబుతే మొదటిది అని టాక్ వినిపిస్తుంది.
ఇక మహేష్ బాబు కొనుగోలు చేసిన కారు ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్టులుక్ ఇప్పటికే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన యంగ్ సెన్సేషన్స్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ సినిమా ముగిసిన తర్వాత ఇక రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు.