ఏంటీ భూమిక.. ఇంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపిందా?
మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరోయిన్.. అక్కడ అవకాశాల కోసం చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో ఇక సౌత్ వైపు అడుగులు వేసింది. ఇక అదే సమయంలో నాగార్జున నిర్మాతగా చేస్తున్న యువకుడు సినిమాలో సుమంత్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తర్వాత సుమంత్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన స్నేహం అంటే ఇదేరా సినిమాలో భూమికను హీరోయిన్గా తీసుకున్నారు ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ హీరోయిన్. వరుసగా అవకాశాలు వచ్చాయి తెలుగు తమిళం భోజ్‌పురి ఇండస్ట్రీలో కూడా ఈమె అవకాశాలు దక్కించుకుంది.
అయితే స్నేహమంటే ఇదేరా అనే సినిమా సమయంలో నాగార్జునతో భూమిక ప్రేమలో పడిపోయింది అంటూ గట్టిగానే ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరు ఎక్కడ బయట కలిసి కనిపించకపోవడంతో ఈ వార్తలు కొన్నాళ్ల వరకు మాత్రమే ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ సినిమాలో నటిస్తుండగా సల్మాన్ ఖాన్ తో భూమిక రిలేషన్ షిప్ లో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మరి కొంతమంది హీరోలతో కూడా భూమిక ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్తలు రాగా ఆమె తల్లిదండ్రులు భయపడిపోయారు.
కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే భూమిక ఓ సెలబ్రిటీ యోగా టీచర్ భరత్ ఠాకూర్ తో పీకల్లోకి ప్రేమలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకుని ఇద్దరికీ పెళ్లి చేయాలని ఇక ఆమె తల్లిదండ్రులు కూడా నిర్ణయించుకున్నారు. 2007లో నాసిక్ లోని గురుద్వార్‌లో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. పెళ్లయిన తర్వాత భూమిక సినిమాలకు దూరమైపోయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం హీరోలకు అక్క, వదిన పాత్రలు చేస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటుంది. హీరోయిన్ గా మాత్రమే కాదు ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించింది భూమిక.