నా జీవితమే ఒక లస్ట్.. కాజోల్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇటీవల కాలంలో సినిమాల కంటే ఓటీటిలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్ లకే ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితుల అవుతున్నారు అనే విషయం తెలిసిందే. సినిమాలకు అయితే కొన్ని లిమిట్స్ ఉంటున్నాయి. కానీ వెబ్ సిరీస్ లకు అలాంటి లిమిట్స్ ఏవి లేకపోవడంతో ఇక ప్రేక్షకులు ఊహించిన దానికంటే కాస్త అతిగానే వెబ్ సిరీస్లను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా బోల్డ్ సన్నివేశాల విషయంలో అయితే ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా రెచ్చిపోతున్నారు వెబ్ సిరీస్లను తెరకెక్కించే దర్శకులు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో బోల్డ్ వెబ్ సిరీస్ లు వచ్చి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసింది.



 ఇక ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. లస్ట్ స్టోరీస్ 2 విడుదలకు ముందే సంచలనాలు రేపుతుంది అని చెప్పాలి.  నాలుగు భాగాలుగా వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మితిమీరిన బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఎంతో మంది విమర్శలు గూప్పిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, మృనాల్  ఠాగూర్, తమన్నా భాటియా, విజయ్ వర్మ, కుముద్ మిశ్రా లాంటి భారీ తారాగణం నటిస్తుంది అని చెప్పాలి. ఆశిష్ దువా, రోనీ స్క్రూవాల నిర్మాతలుగా  వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు లస్ట్ అనే పదం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.


 ఇకపోతే లస్ట్  స్టోరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది కాజోల్. అయితే మీ ఉద్దేశంలో లస్ట్ అంటే ఏమిటి అంటూ కాజోల్ ని ప్రశ్నించారు విలేకరులు. దీనికి ఆమె షాకింగ్ సమాధానం చెప్పింది. కామం, మొహం, విపరీతమైన కాంక్ష ఇలా లస్ట్ అనే పదానికి ఎవరికీ నచ్చినట్లుగా వారు అర్థం చెప్పుకుంటూ ఉంటారు. అయితే నా వరకు మాత్రం లస్ట్ అంటే గాఢమైన కోరిక. అది ఏ విషయంలోనైనా కావచ్చు. ఇక నా వరకు మాత్రం నా జీవితమే ఒక పెద్ద లస్ట్ అని నేను భావిస్తాను. ఇష్టమైన ఫుడ్ తినడం, డాన్స్ చేయడం, సంగీతం వినడం, కుట్లు అల్లికలు ఇవన్నీ కూడా నా లస్ట్ లే. ఇక పిల్లలతో ప్రతిక్షణాన్ని ఆస్వాదించడం కూడా ఈ కోవలోకే వస్తుంది అంటూ కాజోల్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: