ప్రభాస్ లో లోపిస్తున్న అంతర్మధనం !

Seetha Sailaja
‘బాహుబలి’ మూవీతో టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఏహీరోకి దక్కనంత ఖ్యాతి ప్రభాస్ కు దక్కింది. ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే తెలుగు టాప్ హీరోకి లేదు. వరసగా మూడు ఫ్లాప్ లు వచ్చినా ప్రభాస్ మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అన్న వాస్తవాన్ని సెప్టెంబర్ లో విడుదలకాబోతున్న ‘సలార్’ మూవీ మరొకసారి రుజువు చేస్తోంది.


తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆదిపురుష్’ పరాజయం ‘సలార్’ బిజినెస్ పై ఏమాత్రం ప్రభావితం చూపెట్టలేకపోయింది. ప్రస్తుతం ఈన్యూస్ ప్రభాస్ అభిమానులకు జోష్ ను కలిగిస్తోంది. అయితే అంచనాలకు అనుగుణంగా ఎంతవరకు ‘సలార్’ ఘనవిజయం సాధించగలుగుతుంది అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి.


ఇప్పటికే ఈ మూవీ కొంతవరకు మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నాయకుడు’ మూవీ ఛాయాలలో ఉంటుంది అన్న వార్తలు కొంతవరకు కన్ఫ్యూజన్ కలిగిస్తున్నాయి. ‘ఆదిపురుష్’ మూవీ లానే ‘సలార్’ మూవీకి కూడ భారీ స్థాయిలో ఓపెనింగ్ కలక్షన్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే ఒక టాప్ హీరో ఇమేజ్ కి ఓపెనింగ్ కలక్షన్స్ కొంతవరకు ప్రామాణికంగా కనిపించినప్పటికీ ఆతరువాత ఆసినిమా కలక్షన్స్ భయంకరంగా డ్రాప్ అయిపోతే ఎంతటి టాప్ హీరో అయినా ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలబడటం కష్టం. ఈ వాస్తవం ప్రభాస్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


అదేవిధంగా అతడి ఫిజిక్ లో అనేక మార్పులు వస్తున్నప్పటికీ ఆవిషయాన్ని ప్రభాస్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని కొందరు ఆశ్చర్యపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పారితోషికం 100 కోట్ల స్థాయిలో ఉంది. అలాంటి స్థాయి ఉన్న హీరో తన ఫిజిక్ గురించి అదేవిధంగా తాను నటించే సినిమా కథలా గురించి శ్రద్ధ తీసుకోకపోతే అతడి కెరియర్ విషయంలో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అంటూ కొందరు ప్రభాస్ కు సూచనలు చేస్తున్నారు. అయితే ఈవిషయాలను ప్రభాస్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటున్నారు అన్నది రానున్నరోజులలో తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: