యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్
సినిమా జూన్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి దాకా 400 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన కూడా షేర్ పరంగా మాత్రం ఈ
సినిమా ఇంకా బ్రేక్ ఎవెన్ ని అందుకోలేదు.ఇక వారం రోజుల తర్వాత టికెట్ ధరలు కూడా గణనీయంగా తగ్గించడం జరిగింది. 3డీ స్క్రీన్స్ పైన కూడా ఈ
సినిమా టికెట్ రేట్లని తగ్గించారు. దీంతో మరల ఆదివారం నాడు కొన్ని ప్రాంతాలలో ఆదిపురుష్
సినిమా థియేటర్స్ లో మొత్తం 80 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే మల్టీ ప్లెక్స్ లతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఎక్కువ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక నైజాం ఏరియాలో ఇప్పటి దాకా ఆదిపురుష్
సినిమా 30 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేసింది.
బాహుబలి బాహుబలి 2 సినిమాల తర్వాత నైజాం ఏరియాలో 30 కోట్ల షేర్ అందుకున్న
ప్రభాస్ మూడో చిత్రంగా ఆదిపురుష్
సినిమా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే నైజాం బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ
సినిమా ఇంకా బ్రేక్ ఎవెన్ అయితే అందుకోలేదు.
ఇక సోమవారం అనగా ఈరోజు నుంచి టికెట్ ధరలు తగ్గించడంతో పాటు డైలాగ్స్ సీన్స్ విషయంలో కొన్ని మార్పులతో ఆదిపురుష్
సినిమా అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ ఈ సినిమాకి ప్రేక్షకాదరణ పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఒక వేళ చిత్ర యూనిట్ అంచనా వేస్తున్నట్లు ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెరిగితే మాత్రం బ్రేక్ ఎవెన్ ని మారో వారం రోజులలో సాధించే ఛాన్స్ ఉంటుంది.మరి చూడాలి జనాలు ఈ సినిమాకి వస్తారో రారో..ఈ
సినిమా ఆరంభం నుంచి హిందుత్వ సంఘాలకి టార్గెట్ అయ్యింది. ఆదిపురుష్ మూవీలో రామాయణంతో సంబంధం లేని అంశాలని చాలా వరకు చూపించారని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇంకా అలాగే హనుమాన్ డైలాగ్స్ పైన కూడా విమర్శలు వచ్చాయి. దర్శకుడు అందరికి తెలిసిన వాల్మీకీ రామాయణాన్ని వక్రీకరించి చూపించారంటూ నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే మూవీలోని అభ్యంతరకరమైన డైలాగ్స్ ని మార్చడానికి
మూవీ యూనిట్ ఒప్పుకుంది. ఈ మార్చిన వెర్షన్ తో సోమవారం నాటి నుంచి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.