గేమ్ చేంజర్: ఓవర్ చేస్తున్న మెగా అభిమానులు?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మొదటి పాన్ ఇండియా సినిమాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. తండ్రికొడుకులు పాత్రలలో రామ్ చరణ్ దర్శనం ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన చివరి అప్డేట్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇవ్వడం జరిగింది.ఆ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా లాంచ్ చేశారు. ఇక ఈ గేమ్ చేంజర్ టైటిల్ అయితే అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. శంకర్ ఓ వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తూనే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ని కూడా కొనసాగిస్తూ వచ్చారు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి చాలా గ్యాప్ తీసుకున్నారు. తన ఉపాసన గర్భవతి కావడంతో డెలివరీ టైంలో ఆమెతో ఉండాలని ఆయన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.



ఇప్పుడు రామ్ చరణ్ ఇంకా ఉపాసన దంపతులకి కూతురు పుట్టింది. ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం తమ హీరోలకి సంబందించిన సినిమాల అప్డేట్స్ రెగ్యులర్ గా రావాలని కోరుకుంటారు. ఈ అప్డేట్స్ కోసం నిర్మాతలు, దర్శకులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. సోషల్ మీడియాలో నిర్మాత, దర్శకుడిని డైరెక్ట్ గా ట్యాగ్ చేసే సౌకర్యం ఉండటంతో అభిమానులు వారికి ట్యాగ్ చేసి మాకు అప్డేట్ కావాలని బాగా డిమాండ్ చేస్తారు.ఈరోజుల్లో అభిమానులకి ఈ పైత్యం ఈ మధ్య ఎక్కువ అయిపొయింది. తాజాగా గేమ్ చేంజర్ సినిమాకి సంబందించిన అప్డేట్స్ ఏమీ ఇవ్వడం లేదు అని మెగా అభిమానులు దిల్ రాజు, దర్శకుడి శంకర్ కి ట్యాగ్ చేసి అనేక పోస్టులు పెడుతున్నారు. ఇంకా అంతే కాకుండా హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి  ట్రెండ్ చేస్తున్నారు. దిల్ రాజు మీద క్రియేట్ చేసిన ఈ నెగటివ్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: