ఓటీటీ లో దూసుకుపోతున్న మళ్ళీ పెళ్లి మూవీ....!!

murali krishna
విజయ నిర్మల కుమారుడు హీరో నరేష్ ప్రధాన పాత్రలో నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఈ మధ్యనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.నిజానికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు కూడా తీసుకోకుండానే నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారనే వార్తలు గత ఏడాదిన్నర నుంచి అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో నరేష్ ముందు నుంచి ఏవైతే విషయాలు చెబుతూ వచ్చారో, తనను తాను మంచివాడని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారో అవే విషయాలను ఒక సినిమాగా మలిచారు. మళ్ళీ పెళ్లి పేరుతో నవీ నరేష్ పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక నరేష్ భార్య రమ్య రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించగా సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు, విజయనిర్మల పాత్రలో జయసుధ నటించారు.

ఈ సినిమాకి తన నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం లేదని ఇదంతా ఒక కల్పిత కధ అని నరేష్ చెబుతున్నా సరే కావాలని మీడియాలో వచ్చిన పాపులారిటీని సినిమాగా మలిచారని పలు ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎలా ఉన్నా సరే ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది, వాస్తవానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా వీడియోలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రమ్య రఘుపతి లీగల్ నోటీసు ఇవ్వడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దానిని రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేసింది. అయితే ఆహా ఓటీటీ మాత్రం రిలీజ్ చేసేసింది ఇప్పుడు తాజా సమాచారం మేరకు మూడు రోజులకు గాను ఈ మళ్లీ పెళ్లి సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: