ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకొని క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల ఒకరు. ఈనటి పెళ్లి సందD సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ యావరేజ్ విజయం సాధించినప్పటికీ ఈ మూవీ.లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో ... అందచందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో ఈనటికి ప్రస్తుతం క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఈ ముద్దు గుమ్మ చేతిలో ప్రస్తుతం అనేక సినిమాలు ఉన్నప్పటికీ ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం సినిమాపై మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఇన్ని రోజుల పాటు గుంటూరు కారం సినిమాలో ఈ ముద్దు గుమ్మ రెండవ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే.ను తీసి వేసి ఆ స్థానంలో శ్రీ లీల ను పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఈ ముద్దు గుమ్మ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు మూవీ లు కనుక భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించినట్లు అయితే శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రెండు మూవీ లు ఈ ముద్దు గుమ్మకు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.