మరో భారీ బడ్జెట్ చిత్రానికి ఓకే చెప్పిన ప్రభాస్..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే మూడు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.. సలార్, ప్రాజెక్ట్-K, రాజా డీలక్స్, స్పిరిట్ తదితర చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నారు ప్రభాస్. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ అనే చిత్రంలో బిజీగా ఉండడం వల్ల స్పిరిట్ కాస్త ఆలస్యం అవుతుంది. తాజాగా కన్నడ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ తో ప్రభాస్ ఒక సినిమా కమిట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయంపై క్లారిటీ రావడం జరిగింది.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన ఎప్పుడు ప్రభాస్ ను కలిసి స్టోరీ చెప్పాడని విషయం మాత్రం ఇంకా అందరికీ సందేహం గానే ఉంది. కానీ ఈ స్టోరీ ఆయనది కాదట. కెవిఎస్ ప్రొడక్షన్ కన్నడ రైటర్ ది అన్నట్లుగా సమాచారం.. ఈ స్టోరీని తెలుగులో ఎగ్జిక్యూట్ చేసే డైరెక్టర్ ఎవరు అని అన్వేషిస్తూ ఉండగా హరిశంకర్ అయితే ఈ కథని హ్యాండిల్ చేయగలరని నమ్మకంతో ఈ డీల్ సదురు నిర్మాత సంస్థ కుదుర్చుకున్నట్లుగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్టోరీ నా కాదా అనే విషయం ఇంకా సందేహంగానే మిగిలి ఉంది.
ప్రభాస్ కోసం కెవిఎస్ సంస్థ మూడు స్టోరీలను సెట్ చేసినట్లు సమాచారం. అందులో ఒకటి బాగుండడంతో ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కథను డెవలప్మెంట్ చేస్తున్నట్లుగా సమాచారం.. అయితే ఈ చిత్రం స్పిరిట్ సినిమా కంటే ముందుగానే పట్టాలెక్కించాలని సదరు నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్ని డేట్లు కేటాయించగలరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్-K సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్.