తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయినటువంటి నిఖిల్ తాజాగా "స్పై" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి గర్రి బి హెచ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ నెల 29 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం చాలా ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వెస్టిన్ హోటల్ లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నిర్వహించనుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ ఈవెంట్ కు అక్కినేని నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టికింగ్ బుకింగ్స్ ను తాజాగా ఈ మూవీ యూనిట్ ఓపెన్ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
మరి ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా..? ఎప్పుడు ఈ సినిమాకు టికెట్ బుక్ చేసుకుందామా అని చాలా మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటికే కార్తికేయ 2 ... 18 పేజెస్ మూవీ ల విజయాలతో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.