బ్రహ్మానందం కొడుకు గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?

praveen
సినీ ప్రేక్షకులందరికీ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే నాటితరం ప్రేక్షకుల నుంచి నేటితరం ప్రేక్షకుల  వరకు బ్రహ్మానందం కోట్ల మంది అభిమానులను కడుపుబ్బా నవ్వించారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఏడుపదుల వయస్సు దగ్గర పడుతున్న ఇంకా అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యబ్రహ్మగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి. అయితే కమెడియన్ బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. రెండో కుమారుడు సిద్ధార్థ్ బీటెక్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.


 ఇక ఇటీవల అతని ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే మొదటి కుమారుడు గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నే మంచి విజయం సాధించడంతో అతనికీ గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. కానీ గట్టిగా ప్రయత్నించి ఉంటే స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతూ ఉండేవాడు గౌతమ్.



 అయితే ఇప్పుడు సినిమాలలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఇక వ్యాపారంలో మాత్రం ఫుల్ బిజీగా ఉన్నారు గౌతం. ప్రస్తుతం హైదరాబాద్లో తన పేరిట ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్ లను సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ప్రముఖ ఎమ్మెన్సి కంపెనీలలో గౌతమ్  పెట్టుబడులు కూడా పెడుతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కూడా గౌతం కి చాలానే రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక గౌతమ్ నెల సంపాదన అటు సినిమాల్లో సంపాదించిన దాని కంటే ఎక్కువగానే ఉంది. సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గా కొనసాగుతున్న గౌతం ఏకంగా నెలకి 30 కోట్ల వరకు సంపాదిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: