బ్రో: పవన్ వింటేజ్ లుక్ కి డైరెక్టర్ పై ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్ ?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  'తొలి ప్రేమ' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఫ్యాన్ బేస్ పెరిగింది.ఇక ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ వేడుకకు నిర్మాత వివేక్ కూచిభొట్ల అతిథిగా వచ్చారు. అయితే ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఎనర్జీతో కనిపించారో, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'బ్రో' సినిమాలో కూడా అంతే ఎనర్జీటిక్ గా కనిపిస్తారని ఆయన చెప్పారు.బ్రో' సినిమా టీజర్ అప్డేట్ త్వరలో చెబుతామని ఆ సినిమా దర్శకుడు సముద్రఖని ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్ ఇంకా సాయి ధరమ్ తేజ్ ఇద్దరు లుంగీలో కనిపించి బాగా మెప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుంగీ లుక్ అయితే ఆయన నటించిన 'తమ్ముడు' సినిమాను గుర్తు చేసింది. అందులోని 'వయ్యారి భామ...' పాటలో లుక్ ఇంకా ఈ లుక్ సేమ్ టు సేమ్ ఉందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ కి ఫిదా అయిన ఆయన అభిమానులు డైరెక్టర్ సముద్రఖని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్స్ రూపంలో తమ ప్రేమని తెలియజేస్తున్నారు. మా హీరోని ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నామో మీరు అలా చూపిస్తున్నారు నిజంగా మీకు ధన్యవాదాలు సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇటీవల ఆయన హీరోగా చేస్తున్న OG సినిమా షూటింగ్ ఆయన లేకుండానే 50 శాతం పూర్తయ్యింది.ఇక ఈ 'బ్రో' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా  ఓ స్పెషల్ సాంగ్ ని చేసింది. ఆ పాటలో మామా అల్లుళ్లతో కలిసి ఆమె సూపర్ గా స్టెప్పులు వేసింది. ఇది ఆ సాంగులో స్టిల్ అని సమాచారం తెలుస్తుంది. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో మొదటి పాటలో ఊర్వశి రౌతేలా మతిపోయే స్టెప్పులు వేసింది. ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో కలిసి 'ఏజెంట్' మూవీలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. ఇక రామ్, బోయపాటి శ్రీను సినిమాలో సాంగ్ కూడా చేసింది.ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక వరుస పెట్టి సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ సినిమాలతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం ఖాయమని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. ఇక చూడాలి పవన్ కళ్యాణ్ ఆ సినిమాలతో ఎలాంటి హిట్లని అందుకుంటాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: