రంగబలి ట్రైలర్ విడుదల.. పక్కా ఫన్ అండ్ యాక్షన్ మూవీ?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో నాగ సౌర్య హీరోగా నటించిన 'రంగబలి' ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. 'బయటి ఊళ్లో బానిసలా బతికినా తప్పులేదు భయ్యా.. కానీ సొంతూరిలో మాత్రం సింహంలా ఉండాలి'.. అనే ఒక‍్క డైలాగ్ తో 'రంగబలి' స్టోరీ మొత్తం తెలిసిపోయింది.ఈ సినిమా జులై 7 వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన మూవీ యూనిట్ తాజాగా ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. హీరో- సొంతూరు అంటే ఇష్టం అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసిన ఈ మూవీని పూర్తి ఫన్నీగా తీర్చిదిద‍్దినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఈ ట్రైలర్ ఉంది.సొంతూరంటే ఇష్టం, ప్రేమ ఇంకా పిచ్చి ఉన్న ఓ కుర్రాడు.. పండగ, పబ్బం ఏదైనా సరే ఇక్కడి ఉండి చేసుకునే రకం. చక్కగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉన్న హీరో లైఫ్ లోకి కొన్ని సమస్యలు రావడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది బిగ్ స్క్రీన్ పై చూడాలి. ఇంకా అలాగే ఈ ట్రైలర్ లోనే హీరోయిన్ తో ఓ లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు చూపించారు. 



ఈ ట్రైలర్ అంతా చూస్తుంటే చాలావరకు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ సినిమాలో కామెడీతో ఏమైనా మాయ చేస్తారేమో అనేది థియేటర్ లో చూడాలి?ఇక రొమాన్స్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని కలగలపి ట్రైలర్ ను చాలా ఆసక్తిగా కట్ చేశారని చెప్పొచ్చు.ఎప్పటిలాగాగే నాగశౌర్య ఈ సినిమాలో కూడా చాలా ఈజీగా నటించినట్లు కనిపిస్తోంది. ఇక షైన్ టామ్ చాకో ఈ మూవీలో విలన్ గా నటించాడు.అలాగే ఈ రంగబలి మూవీకి పవన్ సీహెచ్ మ్యూజిక్ ని అందించాడు. బ్రహ్మాజీ, మురళీ శర్మ ఇంకా అలాగే సప్తగిరి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా జులై 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.చాలా వరకూ ఫన్నీగా సాగిన ఈ ట్రైలర్.. చివర్లో మాత్రం యాక్షన్ సీన్స్ తోనూ ఉత్కంఠ రేపింది. పవన్ బాసమ్‌శెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: