టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం పూర్తి అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా విజయ్ నటించిన తమిళ సినిమా తేరి సినిమాకు రీమేక్ అని గతంలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రచయితగా పని చేస్తున్న దశరథ్ ఈ సినిమా పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వున్న అనుమానాలను తీర్చి వారికి గుడ్ న్యూస్ చెప్పాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన దశరథ్ తేరి సినిమా నుంచి కేవలం బేస్ లైన్ ను మాత్రమే హరీష్ శంకర్ తీసుకున్నారని పూర్తిగా సొంత కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
కథ పూర్తిగా చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఆయన తెలిపారు.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ అయితే అదిరిపోయింది. ఆ గ్లింప్స్ కు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అలరించింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తి కాగానే వరుస సినిమా షూటింగ్ లతో చాలా బిజీ కానున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పవన్ నటిస్తున్న వరుస సినిమాలు విజయం అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ టాలెంట్ వున్న యంగ్ డైరెక్టర్లు చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విభిన్నంగా ఉండే పాత్రలనీ ఎంచుకుంటున్నట్లు సమాచారం.. పవన్ కళ్యాణ్ తన సినిమా కథలలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.