తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో
తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో పెళ్లి చూపులు ... ఈ నగరానికి ఏమైంది అనే రెండు
మూవీ లకే దర్శకత్వం వహించినప్పటికీ ఈ రెండు సినిమాలు కూడా యూత్ కు బాగా దగ్గర అయ్యాయి. దానితో ఈ దర్శకుడికి రెండు
మూవీ ల తోనే అద్భుతమైన క్రేజ్ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు సినిమాలకు దర్శకత్వం వహించడం తో పాటు
సినిమా లలో కూడా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే
తరుణ్ అనేక సినిమాలలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం
తరుణ్ భాస్కర్ "కీడా కోలా" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే
తరుణ్ భాస్కర్ కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమాలలో ఈ నగరానికి ఏమైంది
మూవీ ఒకటి. ఈ
మూవీ 2018 సంవత్సరం విడుదల అయ్యి యూత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా ఆ సమయంలో
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ
థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ
మూవీ ని
జూన్ 29 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా టికెట్ బుకింగ్ లను కూడా ఓపెన్ చేశారు. ఈ
మూవీ టికెట్ బుకింగ్ కి అన్ని ప్రాంతాల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ
మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.