రవితేజ కారణంగానే.. సురేఖ వాణికీ అవకాశాలు రావట్లేదా?
అంతేకాదు నిర్మాత కేపీ చౌదరిని పబ్లిక్ ప్లేస్ లోనే సురేఖ వాణి ముద్దు పెట్టుకున్న ఫోటోలు కూడా అటు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. ఈ ఫోటోలు చూసిన తర్వాత నిజంగానే సురేఖ వానికి అటు డ్రగ్స్ తో సంబంధం ఉందేమో అని అందరూ చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఇక సురేఖ వాణి కెరియర్ కు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి. అయితే మొదట్లో యాంకర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టింది సురేఖ వాణి. ఆ తర్వాత ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అక్క, వదిన, అత్త, అమ్మ పాత్రల్లో నటించి మెప్పించింది.
సినిమాల్లో హోమ్లీగా కనిపించిన సురేఖ వాణి అవకాశాలు తగ్గిపోవడంతో తన కూతురుతో కలిసి పొట్టి దుస్తువులు వేస్తూ పోటీపడింది. దీంతో ఆమెపై ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ కాస్త నెగటివ్గా మారిపోయింది. దీంతో సురేఖ వాణికి సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే ఆమెకు అవకాశాలు రాకపోవడానికి స్టార్ హీరో రవితేజ కారణమని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఎందుకంటే రవితేజ హీరోగా వచ్చిన సినిమాల్లో నటించడం ద్వారానే సురేఖ వాణికీ ఎక్కువ పేరు వచ్చింది. అయితే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించే సమయంలో సురేఖ వాణికీ రవితేజ కి మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగాయట. అప్పటినుంచి ఆమెకు అవకాశాలు రావట్లేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు.