టాలీవుడ్ లో ఆదిపురుష్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఈ వారం మీడియం రేంజ్, మినిమం అంచనాలున్న సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన "సామజవరగమన" సినిమా కాగా, మరొకటి టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన "స్పై".అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సామజవరగమన సినిమా ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది. నిజానికి 29నే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కొన్ని స్పెషల్ ప్రీమియర్ షో లతో 27న రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత 28న కూడా సిటీ ఏరియాల్లో రాత్రి షోలు వేస్తున్నారు.ఈ ప్రీమియర్ షో లకి వెళ్లిన చాలా మంది ఆడియన్స్ యనానిమస్ గా "సామజవరగమన" సినిమాచాలా బాగుందని పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అలాగే కొంతమంది ట్రేడ్ విశ్లేషకులు కూడా రివ్యూ లు ఇచ్చేసారు. సినిమా నార్మల్ కథే అయినా, 2 గంటల పాటు కడుపుబ్బా నవ్వుకునే సినిమాని తీశారని జనాలంటున్నారు.
ఇక చాలా మంది కూడా వారు ఇటీవలి కాలంలో చూసిన అత్యంత వినోదాత్మక చిత్రాలలో ఇది ఒకటని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు డైలాగ్ డెలివరీ అలాగే కామెడీ సన్నివేశాలకు ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ సినిమా చూడదగ్గ ట్రీట్ అని తెలుస్తుంది.ఇక ప్రేక్షకులు నరేష్ వెన్నెల కిషోర్ పాత్రలను కూడా చాలా ఇష్టపడ్డారు.మొత్తానికి సినిమా చాలా బాగుంది.దీనితో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. శ్రీవిష్ణు ఈ సినిమాతో ఖచ్చితంగా కం బ్యాక్ హిట్ కొట్టినట్టే అని నెటిజన్లు అంటున్నారు.ఈ సినిమాకు భాను బోగవరపు కథను అందించగా నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు.ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా రాశారు.ఈ సినిమాలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్ సుదర్శన్ శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు,రాజీవ్ కనకాల,దేవి ప్రసాద్,ప్రియ తదితరులు నటించారు.