శ్రీ లీల కి ఇన్ని ఆఫర్స్ రావడం వెనక నిజం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా శ్రీ లీల పేరే వినిపిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమై రెండేళ్లు కూడా పూర్తిగా కుండానే టాప్ స్టార్ హీరోలతో యంగ్ హీరోలతో సీనియర్ హీరోలతో జతకడుతూ బిజీగా ఉంది ఈమె. దాదాపు పది ప్రాజెక్టులతో ప్రస్తుతం ఈమె బిజీగా ఉంది. అంటే ఈమెకి ఏ రేంజ్ లో  క్రేజ్ ఉందో తెలుస్తోంది. స్టార్ హీరోయిన్లు సైతం శ్రీ లీల దెబ్బకి షాక్ అవుతున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈమె ఇలా వరుస ఆఫర్లు తెచ్చుకోవడానికి గల ముఖ్య కారణం డాన్స్ అని చెప్పొచ్చు .

డాన్స్ ఈమెకి బాగా ప్లస్ అయింది. తెలుగు హీరోయిన్ల ఊర మాస్ డాన్స్ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఈమె మాత్రం మొదటి సినిమాలోని తన డాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది. ముఖ్యంగా ధమాకా సినిమాలో ఈమె డాన్స్ కి ఒక ప్రత్యేక ఫ్యాన్ బెస్ ఉంది అని చెప్పొచ్చు.దాంతో పాటు ఆమె భాష శ్రీ లీల తెలుగు భాష చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రతి ఏడాది టాలీవుడ్ ని ఇండస్ట్రీకి చాలా మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. కానీ వారిలో 10% మంది కూడా సరిగ్గా తెలుగులో మాట్లాడరు. అమెరికాలో పుట్టి బెంగళూరులో పెరిగిన ఈమె మాత్రం చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది.

అంతేకాదు తన సినిమాకి స్వయంగా ఆమె డబ్బింగ్ చెప్పుకుంటుంది. అంతేకాదు గ్లామర్ కి ఎటువంటి కండిషన్స్ పెట్టదు ఈమె దర్శకులు తనని ఎలా చూడాలి అనుకుంటారో అలాగే నటిస్తుంది. మోడరన్ డ్రెస్సులు వేసిన అంతే అందంగా ఉంటుంది ఈమె. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లో అందరూ 30 ఏళ్లకు పైబడిన వారే. 30 ఏళ్లలో కొంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ వారు స్టార్ హీరోల రేంజ్ మ్యాచ్ చేయలేకపోతున్నారు. కానీ ఈమెకి మాత్రం 22 ఏళ్ళు. దీంతో అటు యంగ్ హీరోలతో విటో స్టార్ హీరోలకి ఈమె పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అందుకే ఈమె అందరూ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: